మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలపై వస్తున్నవి దుష్ప్రచారాలే
రిపోర్టర్: నరేష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలపై జరుగుతున్న ప్రచారమంతా కేవలం దుష్ప్రచారమేనని ఒక అభ్యర్థి స్పష్టం చేశారు. తాను ఎనిమిదేళ్లు పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేశానని, పోస్టల్ శాఖలోనూ ఉద్యోగం సాధించానని తెలిపారు. టీచర్ కావాలనేది తన ప్యాషన్ అని, గత ప్రభుత్వ హయాంలోనూ తనకు ఉద్యోగం వచ్చిందని గుర్తుచేశారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా జెన్యూన్ గానే ఎంపికయ్యానని ఆయన తేల్చిచెప్పారు.