సాయికృష్ణ అదృశ్యం కేసులో సుప్రీంకోర్టు కీలక మధ్యంతర ఆదేశాలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విజయవాడ

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సాయికృష్ణ అదృశ్యం కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం, హైకోర్టులో జరుగుతున్న విచారణపై స్టే విధించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరిన నేపథ్యంలో సీబీఐని ప్రతివాదిగా చేర్చుతూ, కేసు వివరాలను సీల్డ్ కవర్‌లో సెప్టెంబర్ 30నాటికి సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేనెల 12కి ధర్మాసనం వాయిదా వేసింది.