లక్నోలో వృద్ధురాలపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుల అరెస్ట్
రిపోర్టర్: నరేష్
స్థలం: Lucknow
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో పరిధిలోని మోహన్‌లాల్‌గంజ్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన ఘటనలో డెబ్బై ఏళ్ల వృద్ధురాలపై సామూహిక అత్యాచారం జరిగిందని, ఆపై హత్య చేశారని పోలీసులు తెలిపారు. తన ఇంటి సమీపంలో మద్యం తాగుతున్న నిందితులను ఆమె నిలదీయడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి రాజేష్ అలియాస్ గుడ్డు, హరిరామ్ రావత్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు మోహన్‌లాల్‌గంజ్ పోలీసులు శుక్రవారం స్పష్టం చేశారు.