గిటార్ను ప్రయాణికుడిగా భావించి జరిమానా విధించిన బెంగళూరు ఏఐ కెమెరా

రిపోర్టర్: రాము స్థలం: బెంగళూరు

బెంగళూరులో ఏఐ ట్రాఫిక్ కెమెరా చేసిన విచిత్ర పొరపాటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీపునకు గిటార్ తగిలించుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సౌవిక్ దత్తా అనే వ్యక్తిని హెల్మెట్ లేని ప్రయాణికుడిగా ఏఐ కెమెరా గుర్తించి రూ. 500 జరిమానా విధించింది. ఈ ఘటనపై ఆయన సోషల్ మీడియా వేదికగా పోలీసులను ఆశ్రయించగా, జరిమానా రద్దుకు దరఖాస్తు చేసుకోవాలని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు సూచించినట్లు బాధితుడు తెలిపారు.