కలసపాడు నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన హనుమంతు
రిపోర్టర్: హరి
స్థలం: కలసపాడు
కలసపాడు నూతన ఎస్సైగా హనుమంతు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చిన ఆయన, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా హనుమంతు తెలిపారు. ఇక్కడ పనిచేస్తున్న మాజీ ఎస్సై సుభాన్ పులివెందులకు బదిలీపై వెళ్లారు.