'పోలీస్ శాఖ పనితీరు అద్భుతం': బాధితులకు రూ.3.14 కోట్ల విలువైన మొబైల్స్ అందజేత
రిపోర్టర్: మహేష్
స్థలం: Andhra Pradesh
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 7వ విడత మొబైల్ రికవరీ కార్యక్రమంలో 251 ఫోన్లను బాధితులకు జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ అందజేశారు. ఇప్పటివరకు 7 విడతల్లో మొత్తం 1,572 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు పోలీస్ యంత్రాంగం వెల్లడించింది. రికవరీ చేసిన ఫోన్ల మొత్తం విలువ సుమారు రూ.3,14,40,000 ఉంటుందని అధికారులు తెలిపారు.