దర్శిలో గొడ్డలి పార్టీ అరాచకం: పోలీసులపై నామినేషన్ దాడులు భయానకం
రిపోర్టర్: మహేష్
స్థలం: శ్రీకాకుళం
వైఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శకత్వంలో స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో ప్రకాశం జిల్లా దర్శిలో గొడ్డలి పార్టీ గుండాలు తీవ్రంగా బీభత్సం సృష్టించారని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన నేత బెందాళం అశోక్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నామినేషన్ వేసేందుకు వేల సంఖ్యలో కర్రలు, ఇనుప రాడ్లతో వచ్చి దాడులకు తెగబడి పోలీసుల తలలు పగలగొట్టారని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో ఈ పార్టీ అరాచకాలు రోజురోజుకూ శృతిమించిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ మేరకు తీవ్ర ఆరోపణలు చేశారు.