పోలవరం జిల్లాలో భారీ గంజాయి పట్టివేత: ఆరుగురు స్మగ్లర్ల అరెస్ట్

రిపోర్టర్: రమేష్ స్థలం: Polavaram

పోలవరం జిల్లా అడ్డతీగల మండలం వేటమామిడి జంక్షన్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో ముప్పై లక్షల రూపాయల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న సునీల్ కృష్ణ, సుభాష్ మణికంఠ, షేక్ సైదా, పుష్పరాజ్, గురుప్రసాద్, సందేశ్ అనే ఆరుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఒడిశా నుంచి రాజమండ్రికి ఈ గ్యాంగ్ గంజాయిని తరలిస్తుండగా పట్టుబడ్డారని, పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు స్పష్టం చేశారు.