పొన్నూరు ప్రగతికి పునాది: ₹126.28 కోట్లతో సమగ్ర అభివృద్ధి పనులకు శ్రీకారం
రిపోర్టర్: అశోక్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొన్నూరు పట్టణంలో రూ.126.28 కోట్ల భారీ అంచనా వ్యయంతో సమగ్ర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు పొంగూరు నారాయణ వెల్లడించారు. ఇందులో భాగంగా రూ.32.10 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అమృత్ పథకం కింద రూ.22.10 కోట్లతో తాగునీటి సరఫరా, నాగుల చెరువు పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. సీఆర్డీఏ నిధులతో రూ.10 కోట్లతో సీసీ రోడ్లు, గ్రీనరీ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన వివరించారు.