డీఎస్సీపై సీబీఐ విచారణకు అంగీకరించాలంటూ సీఎం చంద్రబాబును డిమాండ్ చేసిన జగన్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
డీఎస్సీ నిర్వహణలో ఎలాంటి తప్పు జరగలేదన్న నమ్మకం ఉంటే సీబీఐ విచారణకు అంగీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును వైకాపా అధినేత జగన్ ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. విజయవాడలో డీఎస్సీపై సీబీఐ విచారణ కోరిన వైకాపా నాయకులపై పోలీసుల లాఠీచార్జిని ఆయన తీవ్రంగా ఖండించారు. తప్పు చేశారు కాబట్టే విచారణకు వెనకడుగు వేస్తున్నారని, నిష్పాక్షిక విచారణ జరిపితేనే ఉద్యోగార్థులకు నిజం తెలుస్తుందని జగన్ పేర్కొన్నారు.