అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ ప్రవేశాల గడువు పొడిగింపు
రిపోర్టర్: శివ
స్థలం: తెలంగాణ
తెలంగాణలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది. బీఏ, బీకాం, బీఎస్సీ ప్రథమ సంవత్సరంలో చేరాలనుకునే విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. అలాగే ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు కూడా అదే తేదీలోగా కోర్సు ఫీజు చెల్లించి ప్రవేశాలను నవీకరించుకోవాలని సూచించారు.