మంచిర్యాలలో ఇంటింటికీ వెళ్లి కుష్టు సర్వేను పరిశీలించిన అధికారులు

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

మంచిర్యాల జిల్లాలోని జైపూర్, హాజీపూర్, నస్పూర్ లలో నిర్వహిస్తున్న జాతీయ కుష్టు వ్యాధి సర్వేను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అబ్జర్వర్ డాక్టర్ విజయనిర్మల పరిశీలించారు. ఆశా కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి సర్వే తీరును పర్యవేక్షించారు. జిల్లాలో నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మంది జనాభాకు ఈ సర్వే నిర్వహించినట్లు ఆమె తెలిపారు.