సోదరికి మొరపెట్టుకున్న కొద్దిసేపట్లోనే యువకుడి దారుణ హత్య

రిపోర్టర్: హరి స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నంలో ప్రాణహాని ఉందని సోదరికి మొరపెట్టుకున్న గంటల్లోనే యువకుడు హత్యకు గురయ్యాడు. భోగాపురం మండలానికి చెందిన మైలపల్లి చంటి పెయిన్‌దొరపేటలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాత్రి సోదరి ఇంటికి వెళ్లి తనకు ప్రాణహాని ఉందని భయం వ్యక్తం చేశాడు. సోమవారం ఉదయం బీచ్‌లో మెడ చుట్టూ తాడు బిగించి, కత్తి గాయాలతో శవమై కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.