రామాయణం సినిమా విజయంపై అమూల్ సంస్థ ప్రత్యేక సృజనాత్మక ప్రకటన

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన రామాయణం సినిమా ఘన విజయం సాధించడంతో ప్రసిద్ధ డెయిరీ బ్రాండ్ అమూల్ అరుదైన రీతిలో అభినందించింది. రావణుడు బ్రెడ్ బటర్ పట్టుకున్నట్లుగా ఉన్న సృజనాత్మక ఇలస్ట్రేషన్ను విడుదల చేసినట్లు చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న ఈ పౌరాణిక చిత్రానికి ఈ ప్రత్యేక నివాళి మరింత ఆకర్షణగా నిలిచిందని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు.