వరకట్న వేధింపులు: నల్దుర్గ్ కోటపై నుంచి దూకిన జాతీయ స్థాయి రెజ్లర్
రిపోర్టర్: వెంకట్
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లా నల్దుర్గ్ కోటపై నుంచి దూకి జాతీయ స్థాయి రెజ్లర్ అశ్విని పోల్ (30) తన ఇద్దరు పిల్లలతో సహా మృతి చెందారు. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు చేస్తున్న వేధింపులే ఈ దారుణానికి కారణమని తండ్రి ఫిర్యాదు చేశారు. మరో కుమార్తె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.