డీసీసీబీ రుణాల మంజూరులో అక్రమ వసూళ్లు: విజయనగరంలో కలకలం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విజయనగరం

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు శాఖల్లో రుణాల మంజూరు కోసం రైతుల నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున వెల్లడించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో ఈ పరిస్థితి నెలకొందని, నోడల్ అధికారులు మరియు న్యాయపరమైన సలహాదారుల పేరుతో బ్యాంకు సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదుల విభాగం ద్వారా వెలుగులోకి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని నాగార్జున హెచ్చరించారు.