దేశవ్యాప్త బ్యాంకు సమ్మె నేపథ్యంలో సెప్టెంబర్ 27న కూడా బ్యాంకులు తెరిచి ఉంటాయని ఆర్థిక శాఖ ప్రకటన
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: న్యూఢిల్లీ
సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభం కానున్న దేశవ్యాప్త బ్యాంకు సమ్మె నేపథ్యంలో వినియోగదారులకు ఊరట కల్పిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 26 నాల్గవ శనివారం, 27 ఆదివారం సెలవులు వచ్చినప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతితో సెప్టెంబర్ 27 ఆదివారం రోజున కూడా ప్రభుత్వ రంగ మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పనిచేస్తాయని ప్రకటించింది. అయిదు రోజుల బ్యాంకింగ్ డిమాండ్‌తో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన సమ్మె పిలుపునకు సంబంధించి చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.