అలాంటి నిరసనలు నేను చూడలేదు: డొనాల్డ్ ట్రంప్
రిపోర్టర్: మహేష్
స్థలం: World
ఐర్లాండ్‌లో తన పర్యటనపై పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయన్న వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. తాను ఎలాంటి నిరసనలను చూడలేదని, వాటి ప్రభావం అంతగా ఉండదని స్పష్టం చేశారు. ఐర్లాండ్‌తో అమెరికా సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని, అయితే అమెరికాతో వాణిజ్య మిగులు కారణంగా ఈ బంధం ఐర్లాండ్‌కు ఎంతో లాభదాయకంగా మారిందని ట్రంప్ పేర్కొన్నారు.