పొన్నమండలో తల్లుల కోసం పోషణ అవగాహన సదస్సు
రిపోర్టర్: K NAGA SRINU
స్థలం: రాజోలు
రాజోలు మండలం పొన్నమండ సిద్ధార్థనగర్ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం జాతీయ పోషణ మహోత్సవంలో భాగంగా తల్లులకు అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం, స్థానిక పదార్థాలతో ఆరోగ్యకరమైన వంటకాలు మరియు అంగన్వాడీ ద్వారా అందించే పౌష్టికాహారం ప్రాముఖ్యతను అధికారులకు వివరించారు. పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ప్రతి ఒక్కరూ సమతుల్య ఆహారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సరస్వతి, అంగన్వాడీ కార్యకర్తలు తులసి, సత్యవతి తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.