నీటి కష్టాలతో అల్లాడిపోతున్న రాయలసీమ అన్నదాతల ఆవేదన

రిపోర్టర్: శ్రీకాంత్ రెడ్డి స్థలం: ధర్మవరం

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ప్రాంతంలో రైతులు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ కార్యకర్త ఒకరు సంచలన వీడియో విడుదల చేశారు. చెరువుల్లో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, రాయలసీమలో వ్యవసాయ ఎమర్జెన్సీ ప్రకటించి సాగునీటి సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే నీటిని విడుదల చేసి చెరువులను నింపాలని, కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.