నల్లగొండలో నీటి పొదుపుపై ప్రత్యేక అధికారి డాక్టర్ రమేష్ కీలక సూచనలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: నల్లగొండ

ఎల్నినో ప్రభావం పొంచి ఉన్నందున రైతులు వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను వేయాలని నల్లగొండ రూరల్ మండల ప్రత్యేక అధికారి డాక్టర్ రమేష్ స్పష్టం చేశారు. నల్లగొండలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీటిని, విద్యుత్ను అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, చెరువులను నింపేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.