అవెల్తిలో పెద్దపులి సంచారం.. అటవీ అధికారుల హైఅలర్ట్!
రిపోర్టర్: వెంకట్
స్థలం: కాకినాడ
కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం శంఖవరం పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అవెల్తి గ్రామంలో పులి దాడిలో ఆవులు మృతి చెందగా, మరికొన్ని గాయపడ్డాయి. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. రాజవొమ్మంగి అటవీ ప్రాంతం వైపు పులి కదులుతున్నట్లు అనుమానిస్తున్న యంత్రాంగం, సమీప గ్రామాల ప్రజలు ఒంటరిగా బయటకు రావొద్దని హెచ్చరించింది.