డేటింగ్ ప్రపంచంలో నిజాయితీ కరువైందంటూ బిగ్ బాస్ విజేత ఎల్విష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
డేటింగ్ ప్రపంచంలో ప్రస్తుతం నిజాయితీ కరువైందని, కేవలం డబ్బు, హోదా మాత్రమే చూస్తున్నారని ప్రముఖ రియాలిటీ స్టార్ ఎల్విష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సంబంధాల్ లో మోసం, అగౌరవం తనకు అసలు ఇష్టం లేదని స్పష్టం చేశారు. మహిళలను తాను ఎప్పుడూ గౌరవిస్తానని, తనపై వచ్చే విమర్శలు అవాస్తవమని ఎల్విష్ యాదవ్ తేల్చిచెప్పారు.