వైకాపాకు రాజీనామా చేసిన ఐదుగురు జడ్పీటీసీ సభ్యులు

రిపోర్టర్: సునీల్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాకు చెందిన ఐదుగురు వైకాపా జడ్పీటీసీ సభ్యులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు బుధవారం రాజీనామా చేశారు. ఈ మేరకు వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖలు పంపినట్లు వారు వెల్లడించారు. కెల్ల శ్రీనివాసరావు, గార తవుడు, వర్రి నరసింహమూర్తి తదితరులు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. వీరిలో కొందరు నాయకులు త్వరలోనే తెదేపాలో చేరనున్నట్లు బహిరంగంగా ప్రకటించారు.