వాహనాల ఫిట్నెస్ పరీక్షకు హై సెక్యూరిటీ నంబరు ప్లేట్ తప్పనిసరి

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

సరకు మరియు ప్రజారవాణా వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలంటే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిబంధన అమల్లోకి తెచ్చిందని అధికారులు తెలిపారు. ఏటీఎస్లో సామర్థ్య పరీక్ష స్లాట్ బుకింగ్ సమయంలో ఈ యూనిక్ నంబర్ నమోదు చేయడం తప్పనిసరి కావడంతో నంబరు ప్లేట్లు లేని వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాత మరియు కొత్త వాహనాల యజమానులు డీలర్లను సంప్రదించి ఈ ప్లేట్లు అమర్చుకోవాలని రవాణా శాఖ స్పష్టం చేసింది.