నెల్లూరు జిల్లాలో త్వరలో పల్లె పండగ మూడు ప్రారంభం
రిపోర్టర్: శివ
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లాలో పల్లె పండగ-3ని త్వరలో ప్రారంభించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ కోటేశ్వరరావు పేర్కొన్నారు. రోడ్డు సదుపాయం లేని గ్రామాలకు వివిధ పథకాల కింద మార్గాలను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. జిల్లాలో గ్రామీణ రోడ్ల అభివృద్ధికి రూ.71 కోట్లు విడుదలయ్యాయని, 35 మండలాల పరిధిలో 39 రహదారుల పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.