ముంబైకి ఆసియా కప్ ట్రోఫీలు వస్తాయన్న బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Mumbai
భారత పురుషుల, మహిళల జట్లు గెలుచుకున్న ఆసియా కప్ ట్రోఫీలు ప్రస్తుతం దుబాయ్‌లోనే ఉన్నాయని, త్వరలోనే ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటాయని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన బీసీసీఐ 95వ వార్షిక సర్వసభ్య సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీలను స్వీకరించేందుకు భారత జట్లు నిరాకరించిన విషయం తెలిసిందే.