స్వయం ఏపీ బ్రాండ్తో మహిళా సాధికారత: సరస్ మేళా నిర్వహణకు చంద్రబాబు ఆదేశం

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

డ్వాక్రా మహిళలు తయారుచేసే ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్కు చేరాలని, ఐదు లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సెర్ప్, మెప్మాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 15 నుంచి విజయవాడలో నిర్వహించనున్న జాతీయ సరస్ మేళాను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.