పరిషత్ ఎన్నికలు: రాష్ట్రంలో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటన

రిపోర్టర్: నరేష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ లో జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నవంబర్ 4 మరియు 5 తేదీలలో రెండు రోజుల పాటు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్ జరిగే ప్రాంతాలలో ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు కూడా నవంబర్ 5న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.