తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ
రిపోర్టర్: కిరణ్
స్థలం: New Delhi
పశ్చిమ బెంగాల్ లో తిరుగుబాటు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కలకత్తా హైకోర్టును ఆశ్రయించాలని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. తక్షణమే ఈ వ్యవహారంపై విచారణ జరిపి త్వరగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రధాన ను ధర్మాసనం అభ్యర్థించింది. నిబంధనల ప్రకారం నేరుగా సుప్రీంకోర్టుకు రావడానికి వీలు లేదని న్యాయమూర్తులు తేల్చిచెప్పారు.