పెద్దపల్లి జిల్లాలో మేఘా సంస్థ ఆధ్వర్యంలో భారీ ప్రకృతి విధ్వంసం
రిపోర్టర్: రమేష్
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లాలో నాగ్పూర్-విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనుల పేరుతో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తోందని స్థానికులు ఆరోపించారు. రక్షిత అటవీ ప్రాంతంలో అనుమతులు లేని చోట వేల మెట్రిక్ టన్నుల మట్టిని తవ్వుతూ, గుట్టలను నేలమట్టం చేస్తున్నారని విమర్శలు వ్యక్తమయ్యాయి. అధికారుల అండదండలతోనే ఈ విధ్వంసం సాగుతోందని పెద్దపల్లి నుంచి ప్రత్యేక కథనం వెల్లడించింది.