నలుగురు స్నేహితుల అద్భుత ఆలోచన: డెబ్బై మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థ

రిపోర్టర్: సతీష్ స్థలం: Himachal Pradesh

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నలుగురు మిత్రులు కలిసి ఏర్పాటు చేసిన హిల్ థ్రిల్ ఆగ్రో ప్రాసెసర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా డెబ్బై మందికి ఉపాధి లభిస్తోందని మేనేజింగ్ డైరెక్టర్ ఖీరమణి తెలిపారు. స్థానికంగా పండే కూరగాయలు, పండ్లతో పచ్చళ్లు, జామ్లు వంటి యాభై రకాల ఆహార ఉత్పత్తులను తయారు చేస్తూ పలు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నామని ఆయన వెల్లడించారు.