రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో డ్వాక్రా మహిళలకు నైపుణ్య శిక్షణ కేంద్రాలు
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
జాతీయ జీవనోపాధుల కార్యక్రమం కింద రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో డ్వాక్రా మహిళలకు నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో గురువారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ లాండ్రీ, బ్యూటీపార్లర్ వంటి వృత్తుల్లో ఆధునిక పరికరాలతో శిక్షణ అందించాలని సూచించారు.