రాష్ట్రంలో కీలక నిర్ణయాలపై నేడు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ భేటీ
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో నేడు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ భేటీలో ప్రభుత్వ ఉద్యోగులకు రెండు కరవు భత్యాలు, 22ఏ భూముల సమస్య, సాగునీటి ప్రాజెక్టులు మరియు సిరిసిల్లలో పేదల ఇళ్ల హక్కుల కల్పన వంటి పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.