తెలంగాణలో బీసీ సీఎం కావటం వంద శాతం ఖాయం
రిపోర్టర్: విజయ్
స్థలం: తెలంగాణ
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో నలుగురైదుగురు బీసీ నాయకులకు చోటు కల్పించాలని కాంగ్రెస్ హైకమాండ్‌ను కోరినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ వెల్లడించారు. తెలంగాణలో భవిష్యత్తులో బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం వంద శాతం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.