అల్లు అర్జున్‌ను కలిసి ఫ్యాన్ బాయ్ మూమెంట్ షేర్ చేసిన మలయాళ డైరెక్టర్

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను మలయాళ దర్శకుడు డొమినిక్ అర్జున్ కలిశారు. 'లోక చాప్టర్ 1' సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న డొమినిక్, బన్నీతో దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన సినిమాను ప్రశంసించారని తెలిపారు. ప్రస్తుతం ఈ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.