బ్యాచిలర్ కావడంతో అద్దె ఇల్లు ఖాళీ చేయాలని యజమాని ఒత్తిడి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Bengaluru
బెంగళూరులో అద్దె ఇల్లు దొరకడం కష్టతరంగా మారింది. నిఖిల్ షియోరాన్ అనే యువకుడు డిపాజిట్ చెల్లించి, అగ్రిమెంట్ చేసుకున్నప్పటికీ తాను బ్యాచిలర్ అనే ఏకైక కారణంతో ఇల్లు ఖాళీ చేయాలని సొసైటీ అధ్యక్షుడు ఒత్తిడి తెచ్చారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, సింగిల్ టెనెంట్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ సొసైటీల నిబంధనలను తప్పుపడుతున్నారు.