కొడాలి నానికి లోకేశ్‌ను విమర్శించే అర్హత లేదు: మంత్రి సుభాష్
రిపోర్టర్: మహేష్
స్థలం: అమరావతి
క్యాసినోలు నడిపే మాజీ మంత్రి కొడాలి నానికి మంత్రి నారా లోకేశ్‌ను విమర్శించే అర్హత లేదని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. తెదేపా భిక్షతో ఎమ్మెల్యే అయిన నాని.. ఇప్పుడు బూతులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అసెంబ్లీకి వచ్చి చర్చించే దమ్ము లేక తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రెస్‌మీట్లు పెడుతున్న జగన్‌కు ఆయన వకాల్తా పుచ్చుకోవడం తగదన్నారు.