తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
రిపోర్టర్: కిరణ్
స్థలం: తిరుపతి
తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పర్యవేక్షణలో గర్భాలయం, ఆలయ ప్రాంగణాన్ని పరిమళ ద్రవ్యాలతో శుద్ధి చేశారు. ఈ నెల 15 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.