తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు
రిపోర్టర్: అశోక్
స్థలం: శ్రీకాకుళం
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు తదితర జిల్లాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వేలాది హెక్టార్లలో వరి, పత్తి పంటలు నీట మునిగాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా రోడ్లు, విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఎడతెరిపి లేని వానలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.