ప్రజా ఉద్యమాల యోధుడికి ఘనంగా తారసిల్లిన జన్మదిన శుభాకాంక్షలు
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం అర్బన్ మండలంలో సీపీఐ సీనియర్ కామ్రేడ్, మాజీ శాసనసభ్యులు పువ్వాడ నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేష్ ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆయన సాగించిన సుదీర్ఘ పోరాటం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ నాయకులు పాల్గొని ఆయన సేవలను స్మరించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.