రైతులకు మెరుగైన ధరలు: సహ్యాద్రి ఫామ్స్‌తో ఏపీ ఉద్యానశాఖ ఒప్పందం
రిపోర్టర్: సురేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఉద్యాన పంటలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధరలు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రకు చెందిన సహ్యాద్రి ఫామ్స్‌తో ఉద్యానశాఖ ఒప్పందం చేసుకోనుంది. రాయలసీమలో ఎఫ్‌పీవోలకు మెంటారింగ్ చేస్తూ, పంటలకు విలువ జోడించి ఉప ఉత్పత్తులుగా మార్చడం ద్వారా రైతులకు లాభాలు చేకూర్చడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశ్యం. ద్రాక్ష, బత్తాయి పంటలతో ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు.