కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు తీవ్రవాదుల నుంచి ప్రాణహెచ్చరికలు

రిపోర్టర్: సురేష్ స్థలం: న్యూఢిల్లీ

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు పోస్ట్ ద్వారా అజ్ఞాత వ్యక్తుల నుంచి ప్రాణహెచ్చరిక లేఖ అందింది. ఉగ్రవాదులు మిమ్మల్ని త్వరలో హతమారుస్తారని ఆ లేఖలో హెచ్చరించారు. న్యూఢిల్లీలోని ఆయన కార్యాలయానికి చేరిన ఈ లేఖపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొన్ని రోజుల క్రితం మరో కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్‌కు కూడా ఇలాంటి బెదిరింపులే రావడం కలకలం రేపింది.