కొమ్మూరులో మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: గుంటూరు

గుంటూరు జిల్లా కొమ్మూరు గ్రామంలో ఎన్టీఆర్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం గార్ల విగ్రహాలను ఎమ్మెల్యేలు బి. రామాంజనేయులు, మొహమ్మద్ నసీర్ అహ్మద్, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ లతో కలిసి ఘనంగా ఆవిష్కరించినట్లు కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ కార్యక్రమం అనంతరం స్థానిక బస్స్టాప్ను ప్రారంభించామని, విగ్రహాల పైన అలాగే లైబ్రరీ కింద వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు.