హైదరాబాద్లోని ఓవైఓ హోటల్లో యువతి అనుమానాస్పద మృతి

రిపోర్టర్: గోపి స్థలం: Hyderabad

హైదరాబాద్లోని ఎస్ఆర్నగర్ గోకుల్ ప్రైడ్ ఓవైఓ హోటల్లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపిందని తెలుగు బులెటిన్ వెల్లడించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం సి. గణేష్ పేరుతో ఓ యువకుడు, యువతి రూమ్ నంబర్ 103లో దిగినట్లు తెలుస్తోంది. ఉదయం గదిలో యువతి విగతజీవిగా పడి ఉండగా, ఆధార్ కార్డు ఆధారంగా మృతురాలి పేరు దుర్గగా గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.