సెప్టెంబర్ 11న దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె
రిపోర్టర్: సతీష్
స్థలం: India
తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సెప్టెంబర్ 11న దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెతో బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం కలగనుంది. వారానికి 5 రోజుల బ్యాంకింగ్, పెన్షన్ సమస్యల పరిష్కారం, పీఎల్ఐ విధానం రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యాలు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో సమ్మె బాట పట్టారు.