పులివెందుల మున్సిపాలిటీ కైవసమే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు కష్టపడాలి: బీటెక్ రవి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Kadapa
పులివెందుల మున్సిపాలిటీని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బీటెక్ రవి పిలుపునిచ్చారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మరో పది రోజులు కష్టపడితే విజయం టీడీపీనే వరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారానికి బౌన్సర్లను నియమించుకోవడం ద్వారా వైసీపీ తన ఓటమిని ముందే అంగీకరించిందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.