దమ్ముంటే కేటీఆర్ను అరెస్ట్ చేయాలంటూ రేవంత్ రెడ్డికి రఘునందన్ రావు సవాల్

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు మాని నిజంగా దమ్ముంటే బీఆర్ఎస్ నేత కేటీఆర్ను అరెస్ట్ చేసి చూపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సవాల్ విసిరారు. హైదరాబాద్లో గవర్నర్ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేవలం తన సొంత నియోజకవర్గంపైనే దృష్టి పెడుతున్నారని విమర్శించారు. ఇదే సమయంలో తూప్రాన్ మండలంలో ఈ నెల నాలుగో తేదీన అమిత్ షా అమూల్ చిల్లింగ్ సెంటర్ను ప్రారంభిస్తారని తెలిపారు.