ప్రధాని మోదీ ప్రజాసేవకు పాతికేళ్లు: మేడ్చల్లో సేవాసంకల్ప అభియాన్ కార్యక్రమం

రిపోర్టర్: హరి స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సేవాసంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా, మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలోని అల్వాల్ డైరీ ఫామ్ రోడ్డు శోభా గార్డెన్స్లో నిర్వహించిన ప్రత్యేక వేడుకల్లో సీనియర్ నేత ఈటల రాజేందర్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ మేరకు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న అగ్రనేత సేవలను ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు కొనియాడారు.