కోహెడ మార్కెట్ పెండింగ్ పనులపై తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక సమీక్ష

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ లోని కోహెడ వ్యవసాయ మార్కెట్ నిర్మాణ పనులపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా దృష్టి సారించారు. పెండింగ్ లో ఉన్న పనులను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మార్కెట్ అందుబాటులోకి వస్తే రైతులకు, వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుందని, మెరుగైన సౌకర్యాలు కలుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనుల్ లో అలసత్వం ప్రదర్శించవద్దని ఆయన హెచ్చరించారు.